ఆయన అందరికీ స్ఫూర్తి ప్రదాత
హైదరాబాద్ : తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ నుంచి తాను అనేక అంశాలు నేర్చుకున్నాని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆయన తమ కుటుంబ సభ్యుల్లో ఒకరని, జయశంకర్ అందరికీ స్ఫూర్తి ప్రదాత అని, అందరిలో ఉద్యమ స్ఫూర్తిని నింపారని ఆమె పేర్కొన్నారు. మేడ్చల్‌లోని కెఎల్‌ఆర్ వెంచర్‌లో మంత్రి మల్లారెడ్డితో కలిసి అమరవీరుల స్థూపం, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ఎమ్మెల్సీ కవిత ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆచార్య జయశంకర్ జయంతిరోజున ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠాపన చేయడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్ని అవహేళనలు ఎదురైనా ఎక్కడా ఆయన అధైర్యపడలేదని ఆమె చెప్పారు.
రాష్ట్ర భావజాల వ్యాప్తికి తన జీవితాన్ని అంకితం…
అంతకుముందు ట్విట్టర్ వేదికగా ప్రొఫెసర్ జయశంకర్‌కు ఎమ్మెల్సీ కవిత నివాళులర్పించారు. రాష్ట్ర భావజాల వ్యాప్తికి తన జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడని ఆమె కొనియాడారు. స్వరాష్ట సాధన కోసం నిరంతరం పరితపించి, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు, అసమాన తలను ఎత్తిచూపుతూ, తెలంగాణ ప్రజల్లో చైతన్య దివిటీ వెలిగించిన గొప్ప మేధావి అని ఆమె తెలిపారు. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ఆ మహానీయుడికి ఘనంగా నివాళులర్పిస్తున్నానన్నారు.
Paid tributes to Telangana ideologue Prof. Jayashankar on his birth anniversary at Telangana Bhavan in New Delhi. pic.twitter.com/Ti31t3vNwO
— Kavitha Kalvakuntla (@RaoKavitha) August 6, 2018