Monday, December 23, 2024

ఆర్‌టిసి విలీనంపై సిఎం, గవర్నర్ కు కృతజ్ఞతలు

- Advertisement -
- Advertisement -
టిజెఎంయు నేత హనుమంతు ముదిరాజ్

హైదరాబాద్ : టిఎస్ ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేయడం పట్ల తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టిజెఎంయు) హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ టిఎస్ ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ఏకైక ఎజెండాతో తమ సంస్థ ఆవిర్భవించిందని నాటి నుండి 97 డిపోల్లో చైతన్య యాత్రలు నిర్వహిస్తూ నిరంతరం ఈ నినాదాన్ని సజీవంగా ఉంచి ప్రభుత్వ దృష్టికి తెచ్చామన్నారు. తాము చేపట్టిన ఉద్యమంతో ఎట్టకేలకు ఆర్‌టిసి విలీన ప్రక్రియను సార్థకం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఇందుకు సహకరించిన సిఎం కెసిఆర్‌కు, గవర్నర్ తమిళి సౌకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. అదేవిధంగా తమకు రావలసిన 2013కు సంబంధించిన వేతన సవరణ బకాయిలు 50 శాతం, బాండ్ డబ్బులు, అలాగే 2017, 2021 వేతన సవరణలు జరగలేదు కాబట్టి తమకు 2017 నుంచి గవర్నమెంట్ వేతనాలు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు. అలాగే తాము పొదుపు చేసుకున్న డబ్బులను కూడా చెల్లించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నామన్నారు. మొత్తంగా టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని తమ డిమాండ్‌ను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News