Tuesday, November 26, 2024

చంద్రుడు మరింత క్లోజప్‌లో చంద్రయాన్-3 (తాజాఫోటోలు)

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : చంద్రుడిని అతి దగ్గరి నుంచి చిత్రీకరించిన ఛాయాచిత్రాలు చంద్రయాన్ 3 వ్యోమనౌక ద్వారా ఇస్రో ప్రధాన కేంద్రానికి అందాయి. వీటిని సోమవారం ఇస్రో వర్గాలు విడుదల చేసింది. వ్యోమనౌక ఇప్పుడు పూర్తిస్థాయిలో చంద్రుడి గురుత్వాకర్షక శక్తి పరిధిలోకి వెళ్లింది. ఈ ప్రక్రియ ఒక్కరోజు క్రితం విజయవంతం అయింది. ఇక చంద్రుడిపై వాలేందుకు కొన్ని రోజులు పడుతుంది. ఈ దశలో చంద్రయాన్ 3 నుంచి జాబిల్లి ఫోటోలను పలు రకాలుగా నౌకలోని అత్యంత అధునాతన కెమెరాల ద్వారా తీసి ఇస్రో కేంద్రానికి పంపించారని వివరించారు. ఇక చంద్రుడిపైకి చేరేందుకు చంద్రయాన్ 3 సంబంధిత కక్ష తగ్గింపు ప్రక్రియను చేపడుతారని, ఇది విజయవంతం అయితే ఇక మిగిలేది చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌ల్యాండింగ్ ఘట్టమే అని ఇస్రో తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News