Sunday, January 5, 2025

బ్రిటన్‌లో కోవిడ్ ఎరిస్ వ్యాప్తిభయాలు

- Advertisement -
- Advertisement -

లండన్ : ఇంగ్లాండ్‌లో సరికొత్త కోవిడ్ వేరియంట్ ఎరిస్ త్వరితగతిన వ్యాపిస్తోంది. దీని లక్షణాలు తీవ్రస్థాయిలో ఉన్నందున జనం అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరించారు. ఇంతకు ముందు అర్కచురస్ వేరియంట్ వ్యాపించింది. దీని తరువాత ఇప్పుడు ఎరిస్ ప్రమాదకరంగా మారింది. దేశ ఆరోగ్య భద్రతా విషయాల సంస్థ యుకెహెచ్‌ఎస్‌ఎ ఈ వేరియంట్ గురించి పలు రకాలుగా జాగ్రత్తలు వెలువరించింది. ఒమిక్రాన్ సంబంధిత కోవిడ్ వేరియంట్ల క్రమంలో తలెత్తిన ఈ రకం గత నెలలో ఈ వైరస్ వెలుగులోకి వచ్చింది. పలువురికి సోకిందని సంస్థ తెలిపింది. ఇజి .5.1గా దీనిని శాస్త్రీయంగా వ్యవహరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News