Friday, December 20, 2024

అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి బిఆర్‌ఎస్‌లో చేరికలు

- Advertisement -
- Advertisement -

గద్వాలప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు గడపగడపకు చేరుతున్నాయని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఇర్కిచేడు గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీలోకి చేరారు. వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…సిఎం కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి, ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు బిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. సంక్షేమం అంటేనే బిఆర్‌ఎస్, బిఆర్‌ఎస్ అంటేనే అభివృద్ధి అనే విధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వివరించారు. బిఆర్‌ఎస్ పార్టీలో కొత్త, పాత అని తేడా లేకుండా నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు.

పార్టీలో చేరిన వారిలో ఇర్కిచేడు మాజీ సర్పంచు భూపతిరెడ్డి, లక్ష్మీరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, ఆంజనేయులురెడ్డి, నర్సింహ్మరెడ్డి, జాందప్ప, సుగయ్యస్వామి, గో పాల్‌గౌడ్, షంషాలం, కురువ ఆంజనేయులు, చాకలిరాజు, హనుమంతు, బెల్లం జంగిలప్ప, తిమ్మారెడ్డి నర్సిరెడ్డి,తిమ్మప్ప, రంగస్వామి, టైలర్ నర్సింహులు, తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు రాజారెడ్డి, విజయ్, జడ్పీటీసీ రాజశేఖర్, ఎంపీటీసీ గోపాల్‌రెడ్డి, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు ఆంజనేయు లు, బిఆర్‌ఎస్‌పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News