Monday, November 25, 2024

ఇందిరా పార్క్, వి.ఎస్.టి ఫ్లైఓవర్ స్టీల్ బ్రిడ్జి త్వరలో ప్రారంభం

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో ః ఇందిరా పార్క్ నుండి వి.ఎస్.టి వరకు రూ.450 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఫ్లై ఓవర్ స్టీల్ బ్రిడ్జి త్వరలో అందుబాటులోకి తేనున్నామని జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్ రోస్ తెలిపారు. సోమవారం ఉదయం ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్,ప్రాజెక్టు ఇంజనీరింగ్,అధికారుల తో కలిసి కమిషనర్ ఫ్లైఓవర్ స్టీల్ బ్రిడ్జి ని పరిశీలించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ. గ్రేటర్ హైదరాబాద్ లో ట్రాఫిక్ అంతరాయం లేకుండా సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు ఎస్‌ఆర్‌డిపి ద్వారా 48 పనులు చేపట్టగా ఇప్పటి వరకు 35 పనులు పూరై అందుబాటులోకి వచ్చాన్నారు. ఈ స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే 36 పనులు పూర్తి కావడమే కాకుండా 20వ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చినట్లు అవతుందన్నారు. మిగతా 12 పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు ఒక్కొక్క పనిని ఎప్పటి వరకు పూర్తి చేయాలో అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

ముషీరాబాద్ శాసన సభ్యులు ముఠా గోపాల్ మాట్లాడుతూ ఇందిరా పార్క్ అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు మీదుగా ఉస్మానియా యూనివర్సిటీ తార్నాక, అంబర్ పేట్ ఉప్పల్ కు వెళ్లాలంటే ట్రాఫిక్ కారణంగా అనేక ఇబ్బందులు పడేవారని ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ ఇబ్బంది తొలగిపోనున్నాయని తెలిపారు.ఇందిరా పార్క్ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్డు మీదుగా 4 జంక్షన్ లకు ఈ ఫ్లై ఓవర్ తో ట్రాఫిక్ సమస్య ఇక ఉండదని అన్నారు.ఈ ఫ్లై ఓవర్ పనులు పూర్తి అయిన నేపథ్యంలో మున్సిపల్ పట్టణాభివృద్ధి ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు చేతులు మీదగా త్వరలో ప్రారంభం కానుందని తెలిపారు. అదేవిధంగా తదనంతరం కమిషనర్ రోనాల్ రోస్, ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఇందిరాపార్కు ను పరిశీలించారు.ఈ సందర్భంగా కమిషనర్ వాకర్స్ తో మాట్లాడి పార్కు లో గల సౌకర్యాలు నిర్వహణకు కావలసిన వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఆర్‌డిపి సిఇ దేవానంద్, ఎస్‌ఇ రవీందర్ రాజు, యుబిడి అడిషనల్ కమిషనర్ కృష్ణ, డైరెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News