తొలకరి జల్లు పడగానే మనసును రంజింపచేసేలా వచ్చే మట్టి వాసన, పులకింప జేసే చిటపట చినుకులు, చెంపలను ముద్దాడుతూ గిలిగింతలు పెట్టె చిరుగాలి…వర్షాకాలం వచ్చేసిందనడానికి ఇంతకు మించినది ఏముంటుంది? తెలంగాణలోకి రుతుపవనాల రాకతో పాటు ఉర్రూతలూగించే రుచుల శ్రేణిని కూడా వెంట తీసుకువచ్చింది. ఈ వర్షాకాలంలో తెలంగాణలో అత్యంత ప్రాచుర్యం పొందిన కొన్ని రుచికరమైన వంటకాలు చూస్తే…
మొక్క జొన్న చాట్(కార్న్ చాట్): క్లాసిక్ ఫేవరెట్, మొక్క జొన్న చాట్‌తో ప్రారంభిద్దా. దీనిని కార్న్ చాట్ అని కూడా పిలుస్తారు. వర్షాకాల పు వైభవాన్ని అద్భుతంగా ఒడిసి పట్టే వంటకం ఇది. తాజాగా ఉడకబెట్టిన మొక్కజొన్న గింజలను శక్తివంతమైన మసాలా దినుసులు, తరిగిన ఉల్లిపాయలు, టమోటాలు, చింతపండు చట్నీతో కలిపి తయారు చేస్తారు. అస్సలు వదులుకోకూడదనే రుచులను మాత్రమే కాదు చిటపట చినుకులు పడుతున్న మరింత ఆనందమూ అందిస్తుంది.
కోడి కొర్రల బజ్జి(చికెన్ వింగ్స్ భజ్జి): మాంసాహార ప్రియులకు, తెలంగాణలో వర్షాకాలం తనతో పాటు కోడి కొర్రల భజ్జి లేదా చికెన్ వింగ్స్ భజ్జి ని తెస్తుంది. చికెన్ వింగ్స్ ను తెలంగాణ ప్రత్యేకమైన స్పైసీ మిశ్రమంలో మెరినేట్ చేసి డీప్ ఫ్రై చేయబడతాయి.
వడలు, దాల్ వడలు: బయట వర్షం కురుస్తున్న కొద్దీ, వేయించిన చిరుతిళ్లను తినాలనే కోరిక తీవ్రమవుతుంది. వడలు, దాల్ వడలను రుచి చూడండి. ఈ స్నాక్స్ కొబ్బరి చట్నీ లేదా సాంబార్‌తో బాగా ఆనందించబడతాయి.
రోస్టెడ్ మొక్కజొన్న: వేయించిన స్నాక్స్ యొక్క ఆకర్షణ కాదనలేనిది అయితే, కొన్నిసార్లు వర్షాకాలంలో అతి చిన్న ఆనందం కూడా ప్రత్యేకంగానే ఉంటుంది. కాల్చిన మొక్కజొన్న అటువంటి ఆనందం అందిస్తుంది .
ఫులౌరా: ఫూలోరి అని కూడా పిలవబడే ఫులౌరా ఒక సంతోషకరమైన అనుభూతి అందిస్తుంది. ఫులౌరాలను చట్నీలతో వేడిగా వడ్డిస్తారు.
మసాలా చాయ్: మసాలా చాయ్ యొక్క అమృతాన్ని ప్రస్తావించకుండా తెలంగాణలో ఏ వర్షాకాల వంట ప్రయాణం పూర్తి కాదు. బ్లాక్ టీ ఆకులు, ఏలకులు, అల్లం, లవంగాలు వంటి సుగంధ ద్రవ్యాలు, పాలు, పంచదారతో కలిపి సృష్టించే ఈ మసాలా చాయ్ అసమానమైన ఆనందాన్ని అందిస్తుంది.
గోల్డ్ డ్రాప్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ మితేష్ లోహియా మాట్లాడుతూ.. “తెలంగాణలో వర్షాకాలంలో వైవిధ్యమైన మరియు నోరూరించే ఆహారాలను అన్వేషిస్తున్నప్పుడు, ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది – ఈ సీజన్ ఆహారం పరంగా పండుగ సమయం. కరకరలాడే ఫ్రై ల నుండి మనస్ఫూర్తిగా ఆస్వాదించే పానీయాల వరకు, ఆహ్లాదకరమైన ట్రీట్లను ఆస్వాదించడంలోని ఆనందాన్ని గుర్తుచేస్తుంది – స్వాద్ జో జిందగీ సే జడ్ జాయే” అని అన్నారు