- Advertisement -
విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో యువకుల సరదాకు ఓ యువ జంట ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన విశాఖ బీచ్ రోడ్డులోని రాడిసన్ బ్లూ వద్ద చోటుచేసుకుంది. సోమవారం రాత్రి అరుగురు యువకులు మద్యం మత్తులో కారు నడుపుతూ భీభత్సం సృష్టించారు. అతివేగంతో కారును నడపడంతో అదుపుతప్పి డీవైడర్ ను ఢీకొట్టి.. పక్కరోడ్డులో వెళ్తున్న ఓ బైకు మీదకు దూసుకెళ్లింది. దీంతో బైక్ పై వెళ్తున్న పృధ్వీరాజ్(28), ప్రియాంక(21) అనే యువ దంపతులు అక్కడికక్కడే మరణించారు.
కారులో ఉన్న ఆరుగురిలో ఓ యువకుడు కూడా మృతి చెందగా.. మిగతావారు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం దవాఖానాకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.
- Advertisement -