ఎల్లారెడ్డిపేట ః ఐటి, పుర పాలక, పట్టణాభివృద్ది శాఖల మంత్రి కెటిఆర్ గత మాసంలో ఎల్లారెడ్డిపేట ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ని మంజూరీ చేశారు. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ సిరిసిల్ల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వడ్లూరి శ్రీనివాస్‌కు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 20 వ తేదిన వేణు గోపాల స్వామి ఆలయ పునరుద్దరణ పనులకు శంకు స్థాపన చేసిన సందర్భంగా త్వరలో ప్రభుత్వ డిగ్రీ కలశాలను ఏర్పాటు చేయగలమని మంత్రి ప్రకటించారు. అంతకు ముందు రూ, 8.5 కోట్ల వ్యయంతో ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన పాఠశాల క్యాంపస్‌ను ప్రారంభించారు. గుణాత్మకమైన బోధన ,కంప్యూటర్ ఎడుకేషన్‌తో విద్చార్థులను తీర్చిదిద్దుటకు ఎల్లారెడ్డిపేటను విద్యా హబ్‌గా మార్చుటకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.
మంగళవారం ఉపసర్పంచ్ ఓగ్గు రజిత బాల్ రాజ్ యాదవ్‌కు కళాశాల ఉత్తర్వుల కాపీని ప్రిన్సిపాల్ అంద చేశారు. 2023- 24 విద్యాసంవత్సరానికి ప్రభుత్వ జూయర్ కళాశాలలో దోస్త్ ద్వార డిగ్రీ అడ్మీషన్లు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. బిఏ ఆంగ్లం , బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్ , సిఏ , బిఎస్సీ బిజడ్‌సి , బిఎస్సీ ఫిజికల్ సైన్స్‌లో ప్రవేశాలు కొనసాగుతాయని తెలిపారు. ఒక్కోక కోర్సులో 60 సీట్ల పరిమితి కలదని తెలిపారు. ఎల్లారెడ్డిపేట , వీర్నపల్లి , ముస్తాబాద్ మండలాలకు చెందిన ఇంటర్ పాసైన విద్యార్థిని, విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంపిపి పిల్లి రేణుక కిషన్ , జడ్పీటిసి చీటి లక్ష్మన్ రావు , స్థానిక సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి , నాయకులు క్రిష్ణా రెడ్డి , క్రిష్ణహరి , మండల సర్పంచులు, ఎంపిటిసిలు మంత్రి కెటిఅర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి సంతోషం ప్రకటించారు. టపాసులు పేల్చి కెటిఅర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.