Friday, December 20, 2024

ఢిల్లీ బిల్లు ఆమోదం వేళ… మంత్రుల శాఖలు మార్చిన కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ లోని ఆప్ ప్రభుత్వం రాష్ట్ర మంత్రివర్గంలో అనూహ్య మార్పు చేసింది. మంత్రి సౌరభ్ భరద్వాజ్‌ను సేవలు, విజిలెన్స్ విభాగం బాధ్యతల నుంచి తప్పించి, ఆ రెండు శాఖలను అతిశీకి అప్పగించింది. పార్లమెంట్‌లో ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లుకు ఆమోదం లభించిన మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఆప్‌లో కీలక నేతలుగా వ్యవహరించిన మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ జైలుకెళ్లడంతో కొద్ది నెలల క్రితం అతిశీ, సౌరభ్ భరద్వాజ్ కేబినెట్‌లో కీలక శాఖల బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు సౌరభ్ ఆధ్వర్యం లోని ఈ శాఖల బాధ్యతలు కూడా అతిశీకి అప్పగించారు.

ఈ మార్పుతో ఢిల్లీ ప్రభుత్వంలో ఉన్న ఒకే ఒక్క మహిళా మంత్రి వద్ద అత్యధికంగా 14 శాఖలు ఉన్నట్లైంది. తాజా మార్పునకు సంబంధించిన ఫైల్‌ను ఆమోదం నిమిత్తం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ , లెఫ్టినెంట్ గవర్నర్‌కు పంపారని సమాచారం. రాజ్యసభలో ఢిల్లీ బిల్లుపై చర్చ జరుగుతోన్న సమయంలో సౌరభ్ భరద్వాజ్ చూస్తున్న శాఖలను ఉద్దేశించి కేంద్ర మంత్రి అమిత్ షా తీవ్ర ఆరోపణలు చేశారు. అర్థరాత్రి ఫైల్స్ అడుగుతారని, స్పెషల్ సెక్రటరీ (విజిలెన్స్) కి రిపోర్టు చేయొద్దని అధికారులకు చెప్తారంటూ విమర్శలు చేశారు. అలాగే సుప్రీం కోర్టు తీర్పు తర్వాత సర్వీస్ సెక్రటరీని బదిలీ చేశారని గుర్తు చేశారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలోనే ప్రస్తుత పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News