Friday, December 20, 2024

దూబే వ్యాఖ్యలతో పగలబడి నవ్విన సోనియా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పార్లమెంట్ లో మంగళవారం రోజు ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బిజెపి ఎంపి నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలతో లోక్ సభలో నవ్వులు విరబూశాయి. కాంగ్రెస్ పార్టీని.. సోనియాగాంధీని ఉద్దేశించి.. అవిశ్వాస తీర్మానంపై మాట్లాడిన దూబే.. మీరు మీ కుమారుడిని ఓ దారికి తీసుకురావాలి.. అతన్ని సెట్ చేయాలి.. అదే విధంగా అల్లుడిని ప్రజెంట్ చేసుకోవాల్సిన పనులు ఉన్నాయి.. ఇన్ని పనులను వదిలేసి మీరు ఈ అవిశ్వాస తీర్మానం

ఎందుకు పెట్టారంటూ సోనియాగాంధీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఎంపి బే వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోని సోనియాగాంధీ సభలోనే పగలబడి నవ్వారు. ఈ సమయంలో కాంగ్రెస్ ఎంపిలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మీరు మీ పార్టీని చూసుకోండి అంటూ బిజెపి ఎంపిలకు కౌంటర్ ఇచ్చారు. మీ పార్టీని మీరు సెట్ చేసుకోండి అంటూ వ్యాఖ్యలు చేశారు. కౌరవులకు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుందని హెచ్చరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News