Saturday, December 21, 2024

వీల్‌చైర్‌లో రాజ్యసభకు మన్మోహన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దిల్లీ అధికారుల నియంత్రణ బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సోమవారం రాజ్యసభకు వీల్‌ఛైర్‌లో వచ్చి ఓటేశారు. దీనిపై విపక్ష నేతలు కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే అనారోగ్యంతో ఉన్న ఆయన వచ్చి ఓటింగ్‌లో పాల్గొనడం బిజెపి, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. సిగ్గుచేటు చర్య అంటూ బిజెపి విమర్శలు గుప్పించింది.

కీలక సమయంలో రాజ్యసభకు వచ్చిన మన్మోహన్ సింగ్‌కు ఆప్ ఎంపీ రాఘవ చదా కృతజ్ఞతలు తెలియజేశారు. మన్మోహన్ సింగ్ విలువలకు అసలైన అర్థం చాటిచెప్పారు. మరీ ముఖ్యంగా బ్లాక్ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు వచ్చారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పట్ల ఆయనకున్న నిబద్ధత అందరికీ స్ఫూర్తిదాయకం. కృతజ్ఞతలు సర్’అని ఆయన రాకపై చద్దా స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News