Sunday, November 24, 2024

కామాఠిపుర యుపిహెచ్‌సి, బార్కాస్ ఆసుపత్రి భవన నిర్మాణాల ప్రణాళికలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో: కామాఠిపురలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు బార్కాస్‌లోని ఆసుపత్రుల విస్తరణకు సంబంధించిన భవన నిర్మాణ ప్రణాళికలను త్వరితగతిన సమర్పించాలని ఇంజనీరింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం ఆయన కామాఠిపుర యుపిహెచ్‌సితో పాటు బార్కాస్ లోని వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులను సందర్శించి విస్తరణకు గల అవకాశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రులలో పరిస్థితులను అక్కడి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

Also Read: జలపాతంలో పడిపోయిన కారు(షాకింగ్ వీడియో)

విస్తరణకు గల అవకాశాలను ఇంజనీరింగ్ అధికారులు కలెక్టర్‌కు వివరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ విస్తరణకు సంబంధించిన ప్లాన్‌తో పాటు పూర్తీ వివరాలతో సిద్దం చేసి సమర్పించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆసుపత్రులలోని అన్ని గదులను పరిశీలించి అక్కడి సిబ్బందికి సూచనలు చేశారు. రోగులకు మరింత నాణ్యమైన సేవలను అందించాలని వైద్యులకు సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ ఓ డాక్టర్ వెంకటి, డి సిహెచ్‌ఓ సునీత, ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News