Saturday, January 11, 2025

నేడు గిరిజన ఆదివాసీ సంరక్షణ హస్తం : బెల్లయ్య నాయక్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం (9 ఆగస్ట్) ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో మండలానికి రెండు తండాలు లేదా ఆదివాసీ గూడెంలలో బస చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ‘గిరిజన ఆదివాసీ సంరక్షణ హస్తం‘ పేరుతో ఈ కార్యక్రమం చేపడ్తోందని టిపిసిసి ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ బెల్లయ్య నాయక్ తెలిపారు. ఆగస్టు 9న మధ్యాహ్నం 2 గం.లకు తండా/గూడెం చేరుకుంటారని, మధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు మహనీయులకు నివాళి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కొమరం భీమ్, సేవా లాల్ మహారాజ్, ఇందిరగాంధీ చిత్ర పటాలకు పూలమాలలు వేసే కార్యక్రమం ఉంటుందన్నారు. సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు గిరిజన సంస్కృతి ప్రదర్శన కళాకారులతో డాన్స్ పాటలు పాడించడం, సాయంత్రం 5-6 గంటలకు నాయకుల ప్రసంగాలు కాంగ్రెస్ పార్టీ వల్ల గిరిజనులకు జరిగిన మేలు, బిఆర్‌ఎస్ పార్టీ చేస్తున్న మోసం గురించి వివరిస్తారు.

గ్రామంలో ఉన్న స్వతంత్ర సమరయోధులు తెలంగాణ ఉద్యమ కారులను సన్మానించడం జరుగుతుందన్నారు. సాయంత్రం 6-7 గంటల మధ్య సంరక్షణ హస్తం ప్రతిజ్ఞ , తండా/గూడెం ప్రజలతో కాంగ్రెస్ హస్తం ఆదివాసీ గిరిజనులను కాపాడుతుంది అని ప్రతిజ్ఞ చేయించడం జరుగుతుంది. రాత్రి 7-9 గంటల మధ్య ప్రజలందరి తో కలిసి సహపంక్తి భోజనం, రాత్రి 9 గంటలకు రాత్రి నిద్ర గ్రామం లోని కాంగ్రెస్ పెద్ద లేదా తండా నాయకుని ఇంట్లో పడుకోవడం ఉంటుంది. 13న ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి తండా నుండి ముఖ్యులను కనీసం 10మందికి వచ్చేలా జరుగుతుందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News