Saturday, December 21, 2024

మొబైల్స్ రికవరీలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మొబైల్స్ రికవరీలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచింది. సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సిఇఐఆర్) పోర్టల్ వినియోగం ద్వారా కోల్పోయిన/దొంగిలించిన మొబైల్ పరికరాల రికవరీ (67.98%) శాతంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం దేశంలోనే మొదటి స్థానాన్ని సాధించింది. ఈ ఘనతను సాధించడంలో సిఇఐఆర్ పోర్టల్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్న సిఐడి ఎడిజి మహేశ్ ఎం. భగవత్, యూనిట్ స్థాయి బృందాలను డిజిపి అంజనీకుమార్ అభినందించారు. మొబైల్ దొంగతనం, నకిలీ మొబైల్ పరికరాల ముప్పును అరికట్టడానికి సిఇఐఆర్ పోర్టల్‌ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డిఒటి) అభివృద్ధి చేసింది. సిఇఐఆర్ పోర్టల్‌ని ఉపయోగించి తెలంగాణ పోలీసులు మొబైల్ ఫోన్‌లను రికవరీ చేయడం తెలంగాణ పౌరులకు ఒక వరం.

సిఇఐఆర్ పోర్టల్ అధికారికంగా మే 17, 2023న దేశవ్యాప్తంగా ప్రారంభించారు. 2022 సెప్టెంబర్‌లో కర్ణాటక రాష్ట్రంలో మాదిరిగానే తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 19, 2023 నుండి పైలట్ ప్రాతిపదికన ప్రారం భించారు. తెలంగాణ రాష్ట్రంలో సిఐడి అడిషినల్ డిజిపి మహేష్ ఎం భగవత్ పోర్టల్‌కు నోడల్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. సిఇఐఆర్ పోర్టల్ తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 780 పోలీస్ స్టేషన్‌లలో నిర్వహిస్తున్నారు. సిఇఐఆర్ పోర్టల్ నోడల్ అధికారి సిఐడి అడిషినల్ డిజిపి మహేష్ భగవత్ పర్యవేక్షణలో రాష్ట్రవ్యాప్తంగా యూనిట్ స్థాయి బృందాలు ఈ మేరకు నిరంతరం కృషి చేస్తున్నాయి. దీని ఫలితంగా (5038) పోగొటు ్టకున్న/దొంగిలించిన మొబైల్ పరికరాలు (110) రోజుల వ్యవధిలో తిరిగి రికవరీ అయ్యాయి, వీటిలో చివరి (1000) (16) రోజుల వ్యవధిలో రికవరీ అయి, ఫిర్యాదుదారులకు అప్పగించారు. (5038) మొబైల్ పరికరాలు రికవరీ, 67.98% రికవరీతో సిఇఐఆర్ పోర్టల్‌ని ఉపయోగించి కోల్పోయిన/దొంగిలించిన మొబైల్ పరికరాల రికవరీ శాతంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం దేశంలోనే మొదటి స్థానంలో నిలవగా, కర్ణాటక (54.20%), ఆంధ్రప్రదేశ్ (50.90%) మాత్రమే ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అవి వరుసగా 2,3 స్థానాలలో నిలిచాయి. ఏప్రిల్ 20, 2023 మరియు ఆగస్టు 07, 2023 మధ్య కాలానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర CEIR పోర్టల్‌లో ఇందుకు సంబంధించిన ఏకీకృత డేటా నిక్షిప్తమై ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News