హైదరాబాద్ : ఈ నెల 5న జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీనగర్ ప్రాంతంలో మహిళను వివస్త్ర ను చేసిన ఘటనపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఘటనను తీవ్రంగా ఖండించింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలపై ఆందోళన కలిగిస్తుందని తెలిపింది. ఘటనపై వెంటనే దర్యాప్తు చేసి బాధితురాలికి వైద్య సహాయం అందించాలని కోరింది. ఘటనపై వారం రోజుల్లోగా డిజిపి అంజనీ కుమార్ నుంచి నివేదిక వస్తుందని ఆశిస్తున్నట్లు కమిషన్ పేర్కొంది.
మద్యం మత్తులో జవహర్‌నగర్‌కి చెందిన పెద్ద మారయ్య అనే వ్యక్తి ఆదివారం రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో అతని తల్లితో కలిసి ఇంటికి వెళ్తున్నాడు. అదే సమయంలో స్థానిక యువతి ఆ మార్గంలో నడుచుకుంటూ వెళ్తోంది. ఆమెను చూసిన నిందితుడు యువతిపై చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే ఏమి చెయ్యాలో తెలియని బాధితురాలు షాక్‌కి గురైయింది. దీంతో ఒక్కసారిగా తేరుకుని నిందితుడ్ని కోపంతో దూరంగా నెట్టేసింది. దీంతో విచక్షణ కోల్పోయిన నిందితుడు మరింతగా రెచ్చిపోయి యువతి బట్టలను చించేసి, వివస్త్రను చేసి ఆమెపై క్రూరంగా ప్రవర్తించాడు. నిందితుడితో పాటు ఉన్న ఆమె తల్లి ఈ దారుణాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. ఘటన జరుగుతున్న సమయంలో ఆ మార్గంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ మహిళ ఈ దారుణాన్ని గమనించి అడ్డుకునే ప్రయత్నం చేసింది.
చుట్టూ ఉన్నవారు ఆపకుండా.. ఫొటోలు, వీడియోలు తీశారు
నిందితుడు ఆమెపై దాడికి దిగాడు. సుమారు 15 నిమిషాల పాటు బాధితురాలు రోడ్డు పైనే నగ్నంగానే ఉంది. చుట్టు పక్కల వారు ఈ దారుణాన్ని అడ్డుకోవాల్సింది పోయి.. వీడియోలు, ఫొటోలు తీశారు. చివరికి నిందితుడు అక్కడి నుంచి వెళ్లాక కొంత మంది వచ్చి ఆమె శరీరంపై కవర్లు కప్పారు. అనంతరం స్థానిక పోలీసులకు సమాచారాన్ని తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అదే కవర్లతో ఆమె గృహనికి పంపించారు. మద్యం మత్తులో ఈ దారుణానికి ఒడుకట్టిన నిందితుడ్ని వివరాలు తెలుసుకుని అదుపులోకి తీసుకున్నారు. మహిళపై మారయ్య దాడి చేస్తున్న దృశ్యాలు స్థానిక సిసి కెమెరాల్లో నమోదు అయ్యాయి. వాటి ఆధారంగా నిందితుడ్ని పట్టుకుని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. ఈ విషయంలో అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహిళను వివస్త్రను చేసిన కేసుపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్
- Advertisement -
- Advertisement -
- Advertisement -