Monday, December 23, 2024

మహేష్ స్టైలీష్ మాస్ లుక్ అదిరింది..

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు తన అభిమానులకు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చాడు. ప్రస్తుతం మహేష్ బాబు ‘గుంటూరు కారం’ అనే మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. బుధవారం మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అర్ధరాత్రి 12.06 గంటలకు కొత్త పోస్టర్ ను విడుదల చేస్తూ మేకర్స్ విషెష్ తెలిపారు.

పంచెకట్టుతో టేబుల్ పై కుర్చుని బీడి అంటించుకుంటున్న మహేష్ స్టైలీష్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటిస్తుండగా, ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టు వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News