Saturday, November 23, 2024

265 మంది ఎస్సి లబ్ధిదారులకు రూ. 5 కోట్ల 46 లక్షలు పంపిణీ….

- Advertisement -
- Advertisement -

సిద్ధిపేట: పైరవీలు లేకుండా ఒక రూపాయి కూడా లంచం ఇవ్వకుండానే నిరుపేద ఎస్సి లబ్ధిదారులకు సహాయం చేస్తున్న ప్రభుత్వ సేవలను గుర్తుంచుకోవాలని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఎస్సి కార్పొరేషన్ ఆధ్వర్యంలో షెడ్యూల్డ్ కులాల లబ్ధిదారులకు స్వయం ఉపాధి రుణాల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమంలో సిద్దిపేట శాసనసభ నియోజకవర్గానికి సంబంధించిన 265 మంది ఎస్సి లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ ను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడారు. ఈ రోజు సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన 265 మంది ఎస్సి లబ్ధిదారులకు 5 కోట్ల 46 లక్షల రూపాయలను పంపిణీ చేశామన్నారు. మిగతా నియోజకవర్గాల్లో కూడా త్వరలోనే పంపిణీ జరుగుతుందని స్పష్టం చేశారు. అన్ని వర్గాల అభివృద్ధి కెసిఆర్ ప్రభుత్వ లక్ష్యమని, జిల్లాలో 1550 మంది ఎస్సి లబ్ధిదారులకు 36 కోట్ల 75 లక్షల రూపాయల సబ్సిడీ డబ్బులను అందజేయడం జరుగుతుందని, ఇంత మొత్తంలో లబ్ధి చేయడం గొప్ప విషయమని ప్రశంసించారు.

Also Read: నన్ను చంపాలని ఎవరో ప్లాన్ వేశారు: చంద్రబాబు

ఎస్సిలకు 10 లక్షల రూపాయల దళితబంధు ఇస్తూనే ఇతర స్కీములు ఆపకుండా ఎస్సి కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాలు, టీ ప్రైడ్ ద్వారా రుణాలు, పిల్లల చదువులకు రెసిడెన్షియల్ విద్యాలయాల ఏర్పాటు, విదేశీ చదువులకు 20 లక్షల రూపాయల అంబేద్కర్ ఓవర్సీస్ రుణాలు అందిస్తున్నామని ఆయన వివరించారు. బిడ్డ కడుపున పడగానే న్యూట్రిషన్ కిట్, బిడ్డ పుట్టగానే కెసిఆర్ కిట్, అంగన్వాడి ద్వారా పౌష్టికాహారం, ప్రీ ప్రైమరీ విద్య కళ్యాణ లక్ష్మి ద్వారా ఒక లక్ష 116 రూపాయలు సాయం చేస్తున్నామని చెప్పారు. 2000 రూపాయల ఆసరా పెన్షన్లు, ఆరోగ్యశ్రీ ద్వారా ఐదు లక్షల రూపాయలు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతు బీమా అందిస్తున్నామని వివరించారు. ఇంత చేస్తున్న మీరు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెంది సద్ది తిన్న రేవుని మరువకుండా ప్రజల నుంచి వచ్చే ఆత్మీయ పలకరింపే తమకు ముఖ్యమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News