Monday, December 23, 2024

కొత్తగా 234 గ్రామ పంచాయతీలు ఏర్పాటు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా 234 గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యాయి. వీటితో కలిపి గ్రామ పంచాయతీల సంఖ్య 13,003 చేరింది. ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో కొత్త పంచాయతీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మూడు బిల్లులను ప్రవేశపెట్టింది. ఇదే సందర్భంగా జీరో అవర్‌లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా పంచాయతీలను ఏర్పాటు చేయాలని వివిధ జిల్లాకు చెందిన అధికార, విపక్ష పార్టీలకు చెందిన శాసనసభ్యులు ప్రస్తావించారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు 12,769 గ్రామ పంచాయతీలు ఉండగా, వివిధ ప్రాంతాల ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన ప్రభుత్వం కొత్తగా 234 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్ల నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసినట్లు పంచాయతీ రాజ్ అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News