హైదరాబాద్: తెలంగాణలో విస్తృతంగా ఉన్న తన శాఖల నెట్‌వర్క్ ద్వారా తన సేవలను అనుసంధానం చేయడం కోసం దేశంలోని ప్రధాన జాతీయ బ్యాంకుల్లో ఒకటయిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రాష్ట్రంలోని వివిధ కీలక మంత్రిత్వ శాఖల అధికారులు, భాగస్వాములతో వ్యూహాత్మక సమావేశాలు నిర్వహిస్తోంది. బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎబి విజయ్‌కుమార్ నేతృత్వంలో కీలక శాఖల అధికారులును అధికారుల బృందం కలుస్తోంది. బ్యాంక్ జోనల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సుశాంత్ గుప్తా, బ్యాంక్‌కు చెందిన అధికారుల బృందం కూడా ఈ సమావేశాల్లో పాలు పంచుకుంటోంది. ఇటీవల ప్రకటించిన త్రైమాసిక ఫలితాల సందర్భంగా బ్యాంక్ సాధించిన విజయాలను ఈ సందర్భంగా విజయ్‌కుమార్ వివరించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బ్యాంక్ రూ.42,000 కోట్ల వ్యాపారం మైలు రాయిని దాటిందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అవకాశాల గురించి కూడా ఆయన వివరించారు. అనంతరం నగరంలో ఇప్పటివరకు సేవలందని వర్గాలు, అట్టడుగు వర్గాలకు చేరువ కావడం కోసం బ్యాంక్ ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది.ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కీలక నెలలో చేపట్టే కార్యక్రమాల్లో భాగంగా దీన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ డాక్టర్ బి నీలిమతో పాటుగా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎబి విజయ్ కుమార్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. స్వయం సహాయక గ్రూపులు, ముద్రా, పిఎంఎస్‌విఎ నిధి, స్టాండప్ ఇండియా తదితర పథకాలకు సంబంధించిన 103 మంజూరు పత్రాలను ఈ సందర్భంగా పంపిణీ చేశారు.