Friday, December 20, 2024

వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి పథకం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)హైదరాబాద్ సర్కిల్ బుధవారం ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి( పిఎంఎస్‌విఎ నిధి) ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. కోఠిలోని ఎస్‌బిఐ ప్రధాన కార్యాలయంనుంచి ఈ పథకానికి సంబంధించిన ఐదు ప్రచార వాహనాలను ప్రారంభించడం ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వీధి వ్యాపారులకు సులభంగా వ్యాపారానికి అవసరమైన పెట్టుబడిని (వర్కింగ్ క్యాపిటల్)అందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వాహనాలు నగరంలోని అన్ని

ప్రాంతాలకు వెళ్లి ఈ పథకం వివరాలను తెలియజేయడంతో పాటుగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని వీధి వ్యాపారులను కోరుతాయి. ఎస్‌బిఐ హైదరాబాద్ సర్కిల్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ జింగ్రాన్, చీఫ్ జనరల్ మేనేజర్ రాజేశ్ కుమార్‌లు జెండా ఊపి ఈ వాహనాలను ప్రారంభించారు. వీధి వ్యాపారులకు సెక్యూరిటీ అవసరం లేకుండా రూ.50,000 వరకు ఈ పథకం కింద రుణాలను అందజేయడం జరుగుతుందని వారు వివరించారు. పలువురు ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రిలయన్స్ జువెల్స్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News