Friday, November 22, 2024

గృహలక్ష్మీకి దరఖాస్తుల వెల్లువ

- Advertisement -
- Advertisement -

కోస్గి: సొంత జాగా ఉండీ ఇల్లు కట్టుకోవాలని పేదలకు రా ష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహా యం అందించే గృహలక్ష్మీ పథకానికి కోస్గి మున్సిపల్, కోస్గి, గుండుమాల్ మండలాలకు చెందిన లబ్ధిదారుల నుంచి బుధవారం వరకు 1582 మంది దరఖా స్తులు చేసుకున్నారని ఆయా మండలాల అధికారులు తెలిపారు. కోస్గి మున్సిపల్ నుంచి 337 దరఖాస్తు లు రాగా కోస్గి మండలం నుంచి 390, గుండుమాల్ మండలం నుంచి 855 మంది దరఖాస్తులు అం దాయని అధికారులు తెలిపారు.

రేపు చివరి రోజు కావడంతో మరిన్ని దరఖా స్తులు అధిక సంఖ్యలో రావచ్చునన్నారు. గుండుమాల్ మండల కేంద్రంలో కొందరు ఇన్‌కమ్, కులం సర్టిఫికెట్‌లు దరఖాస్తుకు జతచేయాలని కొందరు దళారులు చెప్పడంతో మీసేవాలకు, తహసీ ల్దార్ కా ర్యాలయానికి లబ్ధిదారులు ఉరుకులు, పరుగులు తీస్తున్నారు.తహాశీల్దార్ సిబ్బంది మీ సేవా నిర్వహాకుడు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో లబ్ధిదారులు కొంతమేరకు ఉపశమనం పొందారు.

దరఖాస్తుతో పాటు ఆధార్‌కార్డు,రేషన్ కార్డు,స్వంత స్థలం ఉంటే వాటి డా క్యుమెంట్ జిరాక్స్,బ్యాంక్ అకౌంట్ బుక్ జిరాక్స్‌లబ్ధిదారులని ఫోటోతో జతచేసి తహసీల్దార్ కార్యాయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో సమర్పించాలని గుండుమాల్ తహసీల్దార్ పాండు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News