Thursday, December 26, 2024

నిరుద్యోగుల విషయంలో కెసిఆర్ నీరోను తలపించారు: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తొమ్మిదేళ్ల నుంచి నిరుద్యోగుల ఆర్తనాదాలు వినకుండా సిఎం కెసిఆర్ నీరోను తలపించారని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల ముందు ఓట్లు, సీట్లే లక్ష్యంగా ఉద్యోగార్థులకు సన్నద్ధతకు సమయం ఇవ్వకుండా అగ్ని ‘పరీక్ష’ పెడుతున్నారని దుయ్యబట్టారు. గ్రూప్2 పరీక్షల వాయిదా వేయాలని లక్షలాది మంది అభ్యర్థులు ధర్నా చేస్తుండడంతో సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని రేవంత్ చెప్పారు. గ్రూప్  2 పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థులు ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News