- Advertisement -
హైదరాబాద్: రాష్ట్రంలో 20,555 మంది విఆర్‌ఏల్లో 16,758 మందికి వారి విద్యార్హతలను బట్టి పోస్టులను కేటాయించారు. వీటివల్ల తమకు అన్యాయం జరుగుతుందని రెవెన్యూ ఆఫీస్ సబార్డినేట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక జోన్ నుంచి మరో జోన్ రాష్ట్రవ్యాప్తంగా విఆర్‌ఏల సమగ్ర సమాచారాన్ని కలెక్టర్ల ద్వారా ఉన్నతాధికారులకు అందింది. ఏయే జిల్లాల్లో ఎంత మంది ఉన్నారు? ఏం చదువుకున్నారు? ఏ జోన్ పరిధిలో ఉన్నారు? తదితర వివరాలను సేకరించారు.
అయితే ఒక జోన్ లో ఉన్నవారికి మరో జోన్‌లో పోస్టింగ్ ఇచ్చారు. దీంతోపాటు తాజాగా విఆర్‌ఏలకు ఇచ్చిన ఆర్డర్లలో పొరపాట్లు తలెత్తాయని ఇప్పటికే ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. నెల రోజులుగా కసరత్తు చేసినా మళ్లీ పోస్టింగుల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని, ఉద్దేశ్యపూర్వకంగానే అధికారులు వివాదాలను సృష్టిస్తున్నారని విఆర్‌ఏలు ఆరోపిస్తున్నారు.
- Advertisement -