Saturday, November 23, 2024

ఫలించిన ఎమ్మెల్యే ఆరూరి కృషి

- Advertisement -
- Advertisement -
  • వర్ధన్నపేట ఆసుపత్రి 100 పడకలకు అప్‌గ్రేడ్ చేస్తూ జీవో జారీ చేసిన మంత్రి హరీశ్‌రావు

హసన్‌పర్తి: వర్ధన్నపేట ప్రజల చిరకాల కోరిక నెరవేరింది.. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కళ సాకారం అవుతుంది.. ఎట్టకేళకు ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ కృషి ఫలించింది. వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలోని 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆసుపత్రిని 100 పడకల ఏరియా ఆసుపత్రిగా మార్చాలని సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా అసెంబ్లీ సమావేశాల్లో సైతం బీఆర్‌ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ప్రస్థావించారు.

దీనిపై వెంటనే స్పందించిన మంత్రి హరీష్‌రావు వర్ధన్నపేటలో 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆసుపత్రిని 100 పడకల ఏరియా ఆసుపత్రిగా మార్చుతూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆసుపత్రిని 100 పడకల ఏరియా ఆసుపత్రిగా మార్చుతూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆసుపత్రి అభివృద్ధికి రూ. 26 కోట్లతో పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ జీవో జారీ చేశారు. దీనికి సంబంధించిన జీవో కాపీని మంత్రి హరీష్‌రావు ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌కు అందచేశారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావులకు ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని కడిపికొండ పీహెచ్‌సీకి నూతన భవనం ఏర్పాటుచేయడంతో పాటు హసన్‌పర్తి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను 50 పడకల ఆసుపత్రిగా మార్చాలని మంత్రిని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలోనే దానికి అవసరమైన నిధులు మంజూరయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News