- Advertisement -
కల్వకుర్తి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సొంత స్థలం ఉన్న పేద మహిళలకు, ఒంటరి మహిళలకు గృహలక్ష్మి పథకం కింద పూర్తి రాయితీతో అందించనున్న మూడు లక్షల రూపాయల కోసం దరఖాస్తు చేసుకోవడానికి గురువారం చివరి తేది కావడంతో తహసిల్దార్ కార్యాలయం, పురపాలక సంఘం కార్యాలయం, మీ సేవ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున దరఖాస్తుదారులు బారులు తీరారు.
మూడు రోజులుగా కార్యాలయం చుట్టూ తిరుగుతూ మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చివరకు ఎంత మందికి గృహలక్ష్మి పథకం దక్కుతుందో కానీ పెద్ద ఎత్తున దరఖాస్తులు మాత్రం వచ్చాయని అధికారులు చెబుతున్నారు. చివరకు క్షేత్ర పరిశీలనలో ఎన్ని దరఖాస్తులు తిరస్కరించబడతాయని దరఖాస్తుదారులు అంటున్నారు. ఎంత మంది నిజమైన అర్హత కలిగిన లబ్ధిదారులో పరిశీలనలో తేలనుంది.
- Advertisement -