Wednesday, November 27, 2024

జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పూర్తి ఏర్పాట్లు చేయాలి

- Advertisement -
- Advertisement -

గద్వాల ప్రతినిధి : జిల్లాలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పూర్తి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. గురువారం నూతన ఐడిఓసి సమావేశం హాల్‌లో జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ అందరూ అధికారులు సమన్వయంతో పని చేస్తూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జయప్రదం చేయాలని కోరారు. స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై ప్రభుత్వం నుండి మార్గదర్శకాలు రావాల్సి ఉందని, అంతకంటే ముందుగా ఏర్పాట్లపై అందరు అధికారులు సిద్ధంగా ఉండాలని అన్నారు.

పరేడ్ గ్రౌండ్‌లో వేడుకలు నిర్వహించనున్నామని అందుకనుగుణంగా డయాస్, బ్యారికేడింగ్ , సీటింగ్ ఏర్పాటుతో పాటు లోపల, వెలుపలికి వెళ్లే దారిని లెవెలింగ్ చేయవాల్సిందిగా ఆర్‌అండ్‌బీ అధికారికి సూచించారు. వేడుకలకు వచ్చే అతిథికి పోలీసు గౌరవ వందనంతో పాటు వేడుకలలో పోలీసు బందోబస్త్ ఏర్పాట్లు చూడవాల్సిందిగా అడిషనల్ ఎస్పీకి సూచించారు. పట్టణమంతా శుభ్రంగా ఉండేలా చూడాలని, రోడ్ల వెంట ముళ్ల పొదలను తొలగించాలని పరేడ్ గ్రౌండ్‌లో వాటరింగ్ చేయాలని, అందరికి తాగునీరు ఏర్పాటు చేయాలని, మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు.

పలు రంగుల పూలతో డయాస్‌ను అందంగా అలంకరించాలన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు వ్యవసాయ శాఖ మంత్రి చేతుల మీదుగా కెఎస్ ఫంక్షన్ హాల్ ఆర్డర్ కాపీ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మండలం వారిగా కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వారి విద్యాఅర్హత, మండలం అన్ని చూసుకొని ఆర్డర్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్‌పిఎస్. రవి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News