Friday, December 20, 2024

కార్చిచ్చుకు తోడు హరికేన్.. హవాయి దీవులలో 36 మంది బుగ్గి

- Advertisement -
- Advertisement -

హవాయి: అమెరికాకు చెందిన హవాయి ద్వీపంలో భీకర కార్చిచ్చు రగులుకుని పలు ప్రాంతాలకు విస్తరించింది. ఈ క్రమంలో ఇప్పటివరకూ 36 మందివరకూ దుర్మరణం చెందారు. అగ్నికీలలకు లహైనా రిసార్ట్ నగరంలో భయానక పరిస్థితి ఏర్పడింది. ద్వీపం వెంబడి బలీయమైన హరికేన్ తలెత్తడంతో కార్చిచ్చు మరింత ప్రజ్వలితం అయింది.

ఇక్కడి మౌయి మధ్యప్రాంతం మీదుగా కార్చిచ్చు వ్యాపించింది. దీనితో ఈ చారిత్రక పర్యాటక కేంద్రంలో పలు ఇళ్లు , వ్యాపార కేంద్రాలు, పర్యాటక విడిదులు దెబ్బతిన్నాయి. నలు దిక్కుల నుంచి మంటలు వ్యాపిస్తూ ఉండటంతో స్థానికులు దిక్కుతోచనిస్థితిలో సమీపంలోని సముద్రంలో దూకాల్సి వస్తోంది. ఇప్పుడు అత్యధికంగా లహైనా టౌన్‌లో పరిస్థితి దిగజారింది. ఇక్కడి ప్రధాన వీధిలోని ప్రఖ్యాత షాపింగ్ సెంటర్, హోటల్స్ తగులబడుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News