Tuesday, November 5, 2024

ఇళ్లల్లో చోరీ చేస్తున్న దొంగ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః  ఇళ్లల్లో చోరీ చేస్తున్న దొంగను సౌత్‌ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.11,30,000 విలువైన బంగారు ఆభరణాలు,వెండి వస్తువులు, దొంగతానానికి ఉపయోగించే వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…హైదరాబాద్, బిస్మిల్లాకాలనీ, షాహిన్‌నగర్‌కు చెందిన హబీబ్ మహ్మద్ అలియాస్ చోటు తాళం వేసిన ఇళ్లల్లో దొంగతనాలు, బైక్‌లను చోరీ చేసేవాడు.

నిందితుడిపై నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 42కేసులు ఉన్నాయి. ఈ క్రమంలోనే చాంద్రాయణగుట్ట పోలీసులు నిందితుడిని 2022లో అరెస్టు చేసిజైలుకు పంపించారు. జైలు నుంచి హబీబ్ జూలై, 2023లో విడుదలయ్యాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా నిందితుడిలో ఎలాంటి మార్పు రాలేదు, వెంటనే చోరీ చేయాలని పలు కాలనీల్లో తిరిగాడు. ఆ సమయంలో ఈ నెల 12 వతేదీ అర్ధరాత్రి బైక్‌ను చోరీ చేశాడు. బైక్‌కు ఉన్న నంబర్ ప్లేట్ మార్చి సైఫీ కాలనీ, వట్టేపల్లిలో తిరిగి తాళం వేసిన ఇళ్లల్లోకి దూరి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు చోరీ చేశాడు.

హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని సంతోష్‌నగర్, మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఇళ్లల్లో చోరీలు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ చిట్టి బుర్ర, ఎస్సైలు సాయిరాం, అనంతచారి, రాఘవేంద్ర తదితరులు పట్టుకున్నారు. కేసు దర్యాప్తు కోసం నిందితుడిని ఐఎస్ సదన్ పోలీసులకు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News