Monday, December 23, 2024

అభివృద్ధి పనులు త్వరగా పూర్తి అయ్యేలా చూడండి

- Advertisement -
- Advertisement -

నిజాంపేట్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కెపి వివేకాననంద్ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి, కమిషనర్ రామకృష్ణరావు, 17వ డివిజన్ కార్పొరేటర్ ఆగం రాజు ముదిరాజ్, 19వ డివిజన్ కార్పొరేటర్ కసాని సుధాకర్ ముదిరాజ్‌లతో కలిసి ఆయా డివిజన్ల పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. 17వ డివిజన్ పరిధిలో నిర్మాణంలో ఉ న్న ఎస్‌ఎన్‌డిపి నాలా పనులను, 19వ డివిజన్ పరిధిలో ఉన్న రైసీనియా ఇంటెలిపార్క్ క్లబ్ హౌజ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని, వారి పలు సమస్యలు తెలుసుకున్నారు.

త్వరలోనే కాలనీ వాసుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎస్‌ఎన్‌డిపి నాలా నిర్మాణ అధికారులకు పనులు త్వరగా పూర్తి అయ్యేలా చూడాల ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News