Tuesday, November 5, 2024

తెలంగాణలో బహుజన రాజ్యం రావాలి: డా. ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే బడ్జెట్ లో విద్యకు 60 వేల కోట్లు కేటాయించి, విద్యా వ్యవస్థను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, స్వేరోస్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోస్వేరోస్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన బహుజన విద్యార్థి గర్జనకు ముఖ్య అతిధిగా హజరై ప్రసంగించారు. బహుజనుడు ముఖ్యమంత్రి అయితే ప్రతి విద్యార్థి ముఖ్యమంత్రి అయినట్టేనన్నారు. రాష్ట్రంలో వరుసగా పోటీ పరీక్షల షెడ్యూలు విడుదల చేయడంతో లక్షలాది మంది గ్రూప్-2 అభ్యర్థుల ఆందోళన చెందుతున్నారన్నారు.

గ్రూప్-2 అభ్యర్థుల విన్నపం మేరకు మరో మూడు నెలలు గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏళ్ల తరబడి పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ పరీక్షలు, గురుకుల ఉద్యోగాలకు మధ్య ప్రిపరేషన్ కు మధ్య కాల వ్యవది తక్కువ ఉండడంతో లక్షలాదిమంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే మహాత్మ జ్యోతిరావ్ పూలే విద్యా భరోసా పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి మండలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాలలు నిర్మిస్తామన్నారు. కాన్షిరాం స్ఫూర్తితో యువతను నాయకులుగా తీర్చిదిద్ది వారికి స్థానిక సంస్థల్లో యువతకు 30 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించి,ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో షాడో మంత్రులుగా నియమిస్తామన్నారు. యువతను మంత్రివర్గంలో తర్ఫీదునిస్తామన్నారు.

ప్రజా గాయకుడు గద్దర్ స్మారకంగా గద్దర్ ఫ్రీడమ్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. దేశంలో అందరికీ విద్య అనేది దురదృష్టవశాత్తు రాజకీయాలతో ముడిపడి, ప్రధాన సమస్యగా మారిందని ఎం.వి.ఎఫ్ జాతీయ కన్వీనర్ ఆర్.వెంకట్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.పేదల విద్యపై ఆధిపత్య పాలకులకు చిత్తశుద్ధి లేదన్నారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మొగిలిపాక నవీన్ కుమార్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ ముదిగొండ,రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు రాజ్ కుమార్,రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయిబాబా, మహిళా విభాగం రాష్ట్ర ఇంచార్జ్ మాధవి,రాష్ట్ర సహాయ కార్యదర్శి అందే అజయ్ జిల్లా అధ్యక్షులు ఆకులపల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News