Saturday, November 23, 2024

తండాలను పంచాయతీలుగా మార్పు చేయాలి : టి టిడిపి వినతి

- Advertisement -
- Advertisement -

పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కట్టా రాములు నియామకం

హైదరాబాద్ : గిరిజన తండాలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా మార్పు చేయాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు గురువారం ఎన్‌టిఆర్ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన, తెలుగు మహిళా అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి , టిడిపి ప్రధాన కార్యదర్శి ఆజ్మీరా రాజు నాయక్‌లు మాట్లాడుతూ తండాలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా మార్పు చేయడంతో పాటు బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, రెసిడెన్సియల్ పాఠశాలలకు శాశ్వత భవనాలను నిర్మించి ఇవ్వాలని కోరారు. అలాగే రాష్ట్రంలో ఎస్‌టిలకు 10 శాతం రిజర్వేషన్ అమలయ్యేటట్లు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. టిడిపి అధినేత చంద్రబాబుపైనా, నాయకులపైనా ఏపి సర్కారు తప్పుడు కేసులు పెట్టడాన్ని ఆ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, దీంతో సామాన్యులు, పేదలకు వాటిని కొనలేని పరిస్థితి నెలకొందన్నారు. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరల స్థిరీకరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ‘ సాగునీటి ప్రాజెక్టులపై యుద్ద భేరీ ’ పేరిట ఏపిలో సాగునీటి ప్రాజెక్టులను చంద్రబాబు పర్యటించగా దీన్ని రాజకీయం చేసి ఆయనపై శాంతిభద్రలకు విఘాతం కల్పిస్తున్నారంటూ కేసులు నమోదు చేయడం అన్యాయం అని, ఏపిలో పిచ్చివాడి చేతిలో రాయి మాదిరిగా ఏపిలోని పాలన సాగుతోందని ధ్వజమెత్తారు.
రాష్ట్ర కార్యదర్శిగా కట్టా రాములు నియామకం
కాగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కట్టా రాములు నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కట్టా రాములును రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News