Saturday, November 23, 2024

ఉద్యోగులకు రూ.6,210 కోట్లు విరాళం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : శ్రీరామ్ గ్రూప్ వ్యవస్థాపకుడు ఆర్ త్యాగరాజన్ దాదాపు 6 వేల కోట్ల విలువైన తన ఆస్తులన్నింటినీ తన ఉద్యోగులకు విరాళంగా ఇచ్చారు. తన చిన్న ఇల్లు, కారు మినహా తన ఆస్తులు అన్నింటిని విరాళం ఇచ్చినట్టు బ్లూమ్‌బెర్గ్ వెల్లడించింది. 86 ఏళ్ల త్యాగరాజన్ ఇం టర్వూలో మాట్లాడుతూ,- శ్రీరామ్ కంపె నీల్లో నా మొత్తం వాటాను 750 మిలియ న్ డాలర్లు (రూ.6,120 కోట్లు) ఉద్యోగు ల బృందానికి ఇచ్చాను, ఇది 2006లో ప్రారంభమైన శ్రీరామ్ ఓనర్‌షిప్ ట్రస్ట్‌కు బదిలీ చేశామని అన్నారు. శాశ్వత ట్రస్ట్ లో గ్రూప్‌లోని 44 మంది ఎగ్జిక్యూటి వ్‌లు లబ్ధిదారులుగా ఉన్నారు. ‘సాధార ణ ఆదాయం లేని వ్యక్తులకు రుణాలు ఇ వ్వడం నమ్మినంత ప్రమాదకరం కాదని నిరూపించడానికి తాను ఫైనాన్స్ పరిశ్ర మకు వచ్చాను’ అని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News