Monday, December 23, 2024

గజ్వేల్ కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు

- Advertisement -
- Advertisement -

గజ్వేల్  : సిద్దిపేట జిల్లా గజ్వే ల్ నియోజకవర్గంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న కాంగ్రెస్‌లోని గ్రూపుల తగాదాలు కాస్తా గురువారం నడి రోడ్డుపై పరస్పరం దాడులకు చేసుకునేదాకా చే రాయి. కాంగ్రెస్ పార్టీలోని ఇరువర్గాల గ్రూపు నాయకుల, కార్యకర్తలు నానా బూతులు తిట్టుకుని రాజీవ్ రహదారిపై పరస్పరం ముష్టిఘాతాలతో బట్టలు చిం పుకున్నారు. గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్‌పార్టీ సం స్థాగత పరిస్థితులు, పార్టీ అభివృద్ధ్ది, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై చర్చించేందుకుగాను ఎఐసిసి మె దక్ పార్లమెంటరీ పార్టీ ఇంచార్జి విష్ణునాథ్ గురువా రం గజ్వేల్‌కు వస్తున్నట్లు పార్టీ శ్రేణులకు తెలిసింది. దీంతో పట్టణంలోని మల్లారెడ్డి ఫంక్షన్‌హాల్లో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు.

గజ్వేల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం ఆశిస్తున్న పిసిసి డెలిగేట్ సభ్యుడు జస్వంత్ రెడ్డి వర్గం, పిసిసి ప్రచార కార్యద ర్శి బండారు శ్రీకాంత్‌రావు వర్గాలు విష్ణునాథ్‌కు స్వా గతం పలికేందుకు రాజీవ్ రోడ్డు మీద ఉన్న ప్రజ్ఞాపూ ర్ హరిత హోటల్ వద్దకు వెళ్లారు. విష్ణునాథ్ రాకకో సం ఎదురు చూస్తున్న తరుణంలో నర్సారెడ్డి వర్గంలో ని కొందరు కార్యకర్తలు, శ్రీకాంత్‌రావు వర్గానికి కొం తమంది రెచ్చగొట్టుకునేలా మాటలు మాట్లాడుతూ పరస్పర దూషణలకు దిగారు. ఈ వాగ్వాదాలు చివర కు ముదిరి ముష్ఠి యుద్ధ్దానికి దారి తీసింది. ప్రచార కార్యదర్శి శ్రీకాంతరావును అతని అనుచరులు, నర్సారెడ్డి వర్గం అనుచరులు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో శ్రీకాంత్‌రావును రోడ్డుపై పడేసి కొట్టారు. ఇదిలా ఉండగానే మెదక్ పార్లమెంటరీ పార్టీ ఇంచార్జి విష్ణునాథ్ నేరుగా గజ్వేల్ పట్టణంలో సమావేశం జరగాల్సిన ఫంక్షన్ హాల్‌కు చేరుకున్నారు.

అక్కడికి ముందే చేరుకున్న నర్సారెడ్డి ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సమావేశం నిర్వహించారు. వచ్చిన ఎఐసిసి నేత తనకు కావాల్సిన సమాచారాన్ని తీసుకున్నారు. అదే సమయంలో గ్రూపుల నాయకులు, కార్యకర్తలు ఆయనకు జరిగిన ఘటనపై ఫిర్యాదులు చేసుకున్నారు. సమావేశం ముగించుకుని విష్ణునాథ్ వెళ్లిన తర్వాత మూడు గ్రూపుల నాయకులు పోలీసు స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఇటీవల గాంధీ భవన్‌లో జరిగిన సమావేశంలో పిసిసి ప్రచార కార్యదర్శి బండారు శ్రీకాంత్ రా వు, పిసిసి డెలిగేట్ సభ్యుడు మాదాడి జస్వంత్ రెడ్డిలు డిసిసి అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డికి వ్యతిరేకం గా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించిన సంఘటన హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సన్నివేశంతో నర్సారెడ్డివర్గం కొంత ఆగ్రహంగా ఉందని, ఆపరిణామమే గురువారం పరస్పరం మాటల యుద్ధం నుంచి ముష్ఠియుద్ధానికి దారితీసిందని పార్టీలోని కొందరు స్థానిక నాయకులు, కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News