Monday, November 25, 2024

అమరరాజా ఈ-పాజిటివ్ ఎనర్జీ ల్యాబ్స్ కు కెటిఆర్ శంకుస్థాపన 

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: అమరరాజా ఈ-పాజిటివ్ ఎనర్జీ ల్యాబ్స్ కు రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శంకుస్థాపన చేశారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని జీఎంఆర్ ఏరోసిటీలో అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ నిర్మిస్తున్న అధునాతన ఇంధన పరిశోధన, ఆవిష్కరణ కేంద్రానికి మంత్రి కెటిఆర్ భూమి పూజా చేశారు. గిగా కారిడార్ లో భాగంగా ఈ-పాజిటివ్ ఎనర్జీ ల్యాబ్స్ నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. “తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న జయదేవ్ కు ధన్యవాదాలు. రెండు రోజుల క్రితం కోల్డ్‌చైన్‌ సెంటర్‌ను ప్రారంభించుకున్నాం. ఈరోజు ఎనర్జీ రీసెర్చ్‌ సెంటర్‌ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. 2030 నాటికి 60 శాతం ఈ-బ్యాటరీలు దేశంలోనే తయారవుతాయి. యువ నైపుణ్యాన్ని ఒడిసిపట్టడంలో టిఎస్‌ఐసి కృషిచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మొబిలిటీ వ్యాలిని ప్రారంభించింది. ఎలక్ట్రికల్ రంగంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలో పరిశ్రమల కోసం అద్భుతమైన ఎకోసిస్టమ్ ఉంది. పరిశోధన, డిజైన్‌, ఇంజినీరింగ్‌ రంగాల్లో హైదరాబాద్‌ ముందంజలో ఉంది” అని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News