- Advertisement -
పెద్ద కొడప్‌గల్: పెద్ద కొడప్‌గల్ మండలంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలలో ఒకరు మృతి చెందారు. వివరాలలోకి వెళితే.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పిట్లం మండలంలోని తిమ్మానగర్ గ్రామానికి చెందిన గొల్ల కిష్ట (48) పెద్ద కొడప్‌గల్ మండలంలోని ప్రధాన రహదారి గుండా వెళుతుండగా, స్కూటి అదుపు తప్పడంతో కింద పడి పోయాడు. ఈ ఘటనలో అతని తలకి బలమైన గాయం అయ్యంది. దీంతో తీవ్ర రక్త స్రావం అయ్యి మృతి సంఘటన స్థలంలోనే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.పోస్ట్ మార్టం నిమిత్తం పోలీసులు మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరించారు.
- Advertisement -