Thursday, November 14, 2024

గిరిజన సంప్రదాయానికి ప్రతీక తీజ్

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: గిరిజనుల సాంప్రదాయానికి తీజ్ పండుగ ప్రతీక అని దేవరకొండ శాసన సభ్యులు,బిఆర్‌ఎస్ పార్టీ నల్గొండ జి ల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శుక్రవారం చింతపల్లి మండలం ధైర్యపూరి తండాలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తీజ్ వేడుకలలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తీజ్ పండుగ సంబురాలను రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాలు, తండాలలో గిరిజనులు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకుంటున్నారని అన్నారు.తమకు మంచి వరుడిని ప్రసాదించమని దేవుడిని వేడుకుంటూ పెళ్లీడుకు వచ్చిన యువతులు 9రోజుల పాటు నవధాన్యాలకు పూజలు చేయడం తీ జ్ ప్రత్యేకత అని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ వాంకుడావత్ బాల్ సింగ్ నాయక్, బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్ రెడ్డి,మండల సర్పంచ్ల పోరం అధ్యక్షులు గున్‌రెడ్డి శ్రీనివాస్ రె డ్డి, రైతు బంధు అధ్యక్షులు ఉజ్జయిని విద్య సాగర్ రావు, ప్రదాన కార్యదర్శి ఉజ్జయిని నరేందర్ రావు,బిఆర్‌ఎస్ పార్టీ ప్రచార కార్యదర్శి వింజమూరి రవి, యస్టి సెల్ అధ్యక్షులు రమావత్ కొండల్ నాయక్, మైనారిటీ అధ్యక్షులు చాంద్ పాషా,కుర్మేడు యం.పి.టి.సి కుంభం శ్వేత శ్రీశైలం గౌడ్,బిఆర్‌ఎస్ నాయకులు రమావత్ బిచ్యనాయక్,రమావత్ రమేష్ నా యక్,ఆరెకంటి చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News