నాగర్‌కర్నూల్ : ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల సాధనకై తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఉద్యమ జాగరణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. సిపిఎస్ విధానం రద్దు, వేతన సవరణ కమిటీ నియామకం, 317 జిఓ సమస్యల పరిష్కారం, సీర్వస్ రూల్స్ వంటి అనేక సమస్యలపై తపస్ ధర్నాకు పిలుపునిచ్చింది.
ఈ సందర్భంగా తపస్ జిల్లా అధ్యక్షులు దెంది రాజారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే అన్ని సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో తీవ్ర ఉద్యమం చేపడుతామని అన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగం పట్ల వివక్షత చూపుతుందని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మనమోని శేఖర్ మాట్లాడుతూ అందరికి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
అనంతరం కలెక్టర్ కార్యాలయం పరిపాలన అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కార్యదర్శి సురేఖ, జిల్లా కార్యదర్శి శారద, రాష్ట్ర బాధ్యులు మల్లికార్జున్, పెంట్యా నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, భాస్కర్ గౌడ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.