కోల్‌కతా : ప్రముఖ అణుభౌతిక శాస్త్రవేత్త, పద్మభూషణ్ గ్రహీత బికాస్ సిన్హా (78) వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో శుక్రవారం ఉదయం కోల్‌కతా లోని తన నివాసంలో కన్ను మూశారు. అణుభౌతిక శాస్త్రవ విభాగంలో ఆయన దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం 2001లో పద్మశ్రీ, 3010లో పద్మభూషణ్ ప్రదానం చేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా ఇటీవల (2022లో ) రాష్ట్ర అత్యున్నత పురస్కారం “బంగభూషణ్ ” అవార్డుతో సత్కరించింది. ఆయన మార్గదర్శకత్వంలో సహ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌న్యూక్లియర్ ఫిజిక్స్ (ఎస్‌ఐఎన్‌పి) , వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రన్ సెంటర్ (విఇసిసి) సంస్థలు యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చి (సిఇఆర్‌ఎన్)తో
సమన్వయమై పార్టికల్ ఫిజిక్సులో ఎన్నో ప్రయోగాలు చేయడమైంది. విఇసిసి లో హోమీబాబా స్థానం సాధించారు. ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీలో సభ్యత్వం పొందారు. పశ్చిమబెంగాల్ ముర్షిదాబాద్ జిల్లాలో కాండి జమీందారీ కుటుంబంలో జన్మించిన సిన్హా కోల్‌కతా ప్రెసిడెన్సీ కాలేజీలో ఫిజిక్స్ చదివారు. తరువాత కేంబ్రిడ్జి లోని కింగ్స్ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఇటలీకి చెందిన మూడో వరల్డ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌తోపాటు అనేక అకాడమీల్లో ఆయనకు సభ్యత్వం ఉంది. శాస్త్ర పరిశోధనలతోపాటు పశ్చిమబెంగాల్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ వైస్ ఛాన్సలర్‌గా కూడా పదవిని అలంకరించారు.
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాళి
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆయన మృతికి తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. ఆయన ప్రతిభావంతుడైన అణుభౌతిక శాస్త్రవేత్త అని, పశ్చిమబెంగాల్ విశిష్ట పుత్రుడని అభివర్ణిస్తూ నివాళి అర్పిం