Monday, December 23, 2024

లోక్‌సభలో బండి వ్యాఖ్యలపై కెటిఆర్ ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

ఇప్పుడు స్పీకర్ ఏం చేస్తారు? అంటూ ప్రశ్న

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌నుఉద్దేశించి పార్లమెంట్‌లో బిజెపి ఎంపి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోడీని అవమానించారన్న కారణంతో కాంగ్రెస్ ఎంపిపై చర్యలు తీసుకున్నారని, మరి ఇప్పుడు సిఎం కెసిఆర్‌పై అత్యంత నీచమైన భాషలో మాట్లాడిన బిజెపి ఎంపిని ఏం చేయాలో స్పీకర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కెటిఆర్ శుక్ర వారం ఉదయం ట్వీట్ చేశారు. ‘ప్రధాని ఇంటిపేరును అవమానకరంగా పిలిచినందుకు కాంగ్రెస్ ఎంపి సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఇప్పుడు తెలంగాణకు చెందిన ఒక బిజెపి ఎంపీ గురువారం లోక్ సభలో తెలంగాణ రాష్ట్రానికి రెండు సార్లు ఎన్నికైన పాపులర్ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను అత్యంత నీచమైన భాషలో దూషించారు. ఇప్పుడు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఏం చేస్తారు..?’ అని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News