శంషాబాద్ ః- శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధురానగర్, శ్రీనివాస ఇంక్లూ వద్ద ఓ గుర్తు తెలియని మహిళలను అత్యాచారం చేసి అనంతరం ఆమెపై పెట్రోల్ పోసి గుర్తు తెలియని దుండగులు నిపట్టించారు. గురువారం అర్ధరాత్రి 12 గంటలకు ఘటన గురించి స్థానిక వాచ్ మెన్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హత్యకు గురైన మహిళ ఎవరు హత్య చేసి ఉంటారనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసులు కేసుకు సంబంధించిన వివరాలను శంషాబాద్ ఎసిపి రామచందర్ రావు మీడియాకు వెల్లడించారు.
ఓ గుర్తు తెలియని మహిళను గుర్తు తెలియని వ్యక్తులు శ్రీనివాస ఎన్ క్లూ సమీపంలో జనవాసాల మధ్య ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. అయితే స్థానికంగా ఉండే ఓ వాచ్ మెన్ సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్నాం. దీంతో డాగ్స్ స్క్వాడ్, క్లూస్ టీమ్ లను రంగంలో దింపి ఆధారాలను సేకరిస్తున్నాం. మృతురాలి కాళ్లకు మెట్టెలు ఉండడంతో ఆమెకు వివాహం అయి ఉంటుందని అనుమానిస్తున్నట్లు ఏసిపి తెలిపారు. చుట్టుపక్కల సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తిస్తామని తెలిపారు. హత్య చేసిన సంఘటనలో ఎంతమంది వ్యక్తులు ఉన్నారని ప్రస్తుతానికి నిర్ధారణ చేయలేదని తొందరలో నిందితులను ఐడెంటిఫై చేస్తామని అన్నారు.