- Advertisement -
హైదరాబాద్ : అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద 2023 -24 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎస్‌సి విద్యార్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించారు. అర్హులైన ఎస్‌సి విద్యార్థులు ఉపకార వేతనాలు పొందడానికి సెప్టెంబర్ 30, 2023 లోగా దరఖాస్తు చేసుకోవాలని ఎస్‌సి అభివృద్ధి శాఖ అదనపు సంచాలకులు డి. ఉమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేయగోరు విద్యార్థులు ఈ పాస్ వెబ్‌సైట్ https://telanganaepass.gov.in నందు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
- Advertisement -