- Advertisement -
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ గేమింగ్,క్యాసినో, గుర్రపు పందేలపై 28 శాతం పన్ను విధించాలని జిఎస్‌టి కౌన్సిల్ ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. నిరసనల మధ్యే కేంద్ర వస్తు సేవల పన్ను( సవరణ ) బిల్లు, ఇంటిగ్రేటెడ్ వస్తుసేవల పన్ను(సవరణ) బిల్లులను పార్లమెంటు ఉభయ సభలు ఎలాంటి చర్చా లేకుండానే ఆమోదించాయి. ఇప్పటికే పలు కీలక బిల్లులను ఆమోదింపజేసుకున్న కేంద్రం వర్షాకాల సమావేశాల చివరి రోజున ఈ సవరణ బిల్లులను తీసుకురావడం గమనార్హం. కాగా సిజిఎస్‌టి, ఇజిఎస్‌టిసవరణ బిలుల్లకు పార్లమెంటు ఆమోదం తెలిపినందున ఆ మేరకు రాష్ట్రాల అసెంబ్లీలు కూడా జిఎస్‌టి చట్టాలకు సవరణలు చేయాల్సిఉంటుంది.
- Advertisement -