Saturday, December 21, 2024

పత్యక్ష పన్ను వసూళ్లు రూ.6.53 లక్షల కోట్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఖజానా కళకళలాడుతోంది. పన్నుల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం నిరంతరం పెరుగుతూనే ఉంది. ఇప్పటికే జిఎస్‌టి రూపంలో ఆదాయం భారీగా పెరగ్గా, ఇప్పుడు ప్రత్యక్ష పన్నుల విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(202324)లో ప్రభుత్వ ప్రత్యక్ష పన్నుల వసూళ్లు గత ఏడాది కంటే 15.7 శాతం ఎక్కువగా నమోదైనాయి. శుక్రవారం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం, 202324 ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు 10 వరకు ప్రభుత్వానికి ప్రత్యక్ష పన్నుల ద్వారా మొత్తం రూ.6.53 లక్షల కోట్లు ఆదాయం వచ్చింది.

గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ప్రత్యక్ష పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాల కంటే ఇది 15.7 శాతం అధికంగా ఉంది. పన్ను చెల్లింపుదారులకు జారీ చేసిన రీఫండ్‌లను తీసివేస్తే, ఆ సంఖ్య రూ. 5.84 లక్షల కోట్లకు వస్తుంది. డేటా ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు 10 వరకు నికర ప్రాతిపదికన ప్రత్యక్ష పన్నుల నుండి వసూళ్లు గతేడాది కంటే 17.33 శాతం ఎక్కువ నమోదయ్యాయి. అదే సమయంలో ఈ సంఖ్య మొత్తం ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలో 32.03 శాతానికి సమానంగా ఉంది. అంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం అంచనా వేసిన ఆదాయంలో 32 శాతానికి పైగా ఆగస్టు 10 వరకు ఖజానాకు చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News