Monday, December 23, 2024

పేలిన సిలిండర్ తల్లిదండ్రులతో పాటు పిల్లలకు గాయాలు

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: – శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని బహదూర్ హలి మక్త ప్రాంతంలో ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇంట్లో నిద్రిస్తున్న తల్లిదండ్రులతోపాటు ముగ్గురు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బహదూర్ ఆలీ మక్త ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. తిరుపతమ్మ మీబాస్ దంపతుల ఇంట్లో శుక్రవారం ఉదయం సిలిండర్ పేలడంతో పెద్ద ఎత్తున శబ్దం విన్న స్థానికులు సదరు ఇంటి వద్దకు వెళ్లి చూడగా. తీవ్ర గాయాలతో తిరుపతమ్మ (45) భర్త మీబాస్(55) కూతురు స్వాతి (10) సంగీ(9) కుమారుడు గణేష్(7) ముగ్గురు పిల్లలతో ఇంట్లో నివసిస్తున్నారు గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇంట్లో ఉన్న చిన్నారులకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులను. స్థానిక ఆసుపత్రికి తరలించారు.

విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయాల పాలైన వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు. ఇంట్లో సిలిండర్ పేలడం పేలడంతో వారు నివసిస్తున్న ఇంటి పైకప్పు రేకులు ఒక్కసారిగా ఎగిరి పడగా చుట్టుపక్కల నివసిస్తున్న కొన్ని కుటుంబాలు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మ మహేందర్ రెడ్డి వెంటనే ఘటనా స్థలాన్ని చేరుకొని సంఘటన జరిగిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమెతోపాటు స్థానిక కౌన్సిలర్ ఆయిల్ కుమార్ కూడా సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి ప్రమాదం కు గురైన కుటుంబ సభ్యులను పరామర్శించారు ప్రమాదానికి గురైన కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా ప్రభుత్వము నుండి ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News