Tuesday, January 21, 2025

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్టు..

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర బిఎస్ పి అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్టు అయ్యారు. గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని గన్ పార్క్ వద్ద ఈరోజు(శనివారం) సత్యాగ్రహ దీక్ష చేపడుతానని ప్రవీణ్ కుమార్ ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు ఆయనను హౌస్ అరెస్టు చేశారు. రాత్రి బిఎస్ పి రాష్ట్ర కార్యాలయానికి భారీగా పోలీసులు చేరుకుని ఆయనను బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. మరోవైపు ఓయూ విద్యార్థులను కూడా దీక్ష దృష్ట్యా పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు.

కాగా, వెంటవెంటనే పరీక్షలు పెడితే ఎలా ప్రిపేర్ కావాలని, ప్రస్తుతం గురుకుల పోస్టులకు పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని టిఎస్ పిస్సి కార్యాలయాన్ని అభ్యర్థులు ముట్టించిన విషయం తెలిసిందే. అయితే, టిఎస్ పిస్సి చైర్మన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో గ్రూప్-2 అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు, ప్రొఫెసర్ కోదండరామ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు అభ్యర్థులకు మద్దతు తెలిపారు. దీంతో పోలీసులు, రాజకీయ నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News