అమరావతి: వృద్ధురాలిని వాలంటీర్ హత్య చేయడం దురదృష్టకరమైన విషయమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విశాఖ పట్నంలో మూడో రోజు పవన్ కల్యాణ్ వారాహి యాత్ర చేపట్టారు. పెందుర్తిలో వాలంటీర్ చేతిలో హత్యకు గురైన బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడారు. వాలంటీర్లతో పిల్లలు, మహిళల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళల మిస్సింగ్‌పై గణాంకాలు తాను చెప్పినవి కావని స్పష్టం చేశారు. పరిశోధన సంస్థలు చెప్పిన గణాంకాలనే తాను ప్రస్తావించానని, వృద్ధురాలిని వాలంటీర్ చంపేస్తే అధికార పక్షం నుంచి స్పందన లేదని మండిపడ్డారు. వృద్ధురాలి కుటుంబానికి జనసేన నేతలు అండగా నిలిచారని కొనియాడారు. రౌడీషీటర్‌కు ఎంపి కుటుంబాన్ని కిడ్నాప్ చేసే ధైర్యం ఎక్కడిది అని ప్రశ్నించారు. రౌడీషీటర్‌కు సదరు ఎంపి వత్తాసు పలికేలా చర్యలు ఉండటమేంటని ఎద్దేవా చేశారు.
Also Read: కాలిబాటలో బోన్లు ఏర్పాటు చేస్తాం: టిటిడి ఇఒ