Monday, January 20, 2025

ఎమ్మెల్యే చిరుమర్తి మార్నింగ్ వాక్

- Advertisement -
- Advertisement -

నల్లగొండ:నార్కెట్‌పల్లి పట్టణంలోని పలు వార్డులలో శనివారం మార్నింగ్ వాక్‌లో భాగంగా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప ర్యటించారు. పట్టణంలో చేపట్టిన పలు అభివృధ్ది ప నులను పరిశీలించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గడపగడపకు వెళ్లి ప్ర జలకు ఆత్మీయంగా పలకరించారు.

ఈ సందర్భంగా పిల్లలతో మాట్లాడి వారి చదువును గురించి అడిగారు. వృధ్ధులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను, తెలుసుకున్నారు. వార్డులలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.వృధ్ధులకు పెన్షన్ అందుతుందా లేదా అనే విషయాలు అడిగి తెలుసుకున్నారు. పట్టణంలోని బిసి కాలనీకి చెందిన గాలి మణెమ్మ అనారోగ్యంతో బాధపడుతుండగా ఆమె కు 5వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు.

అదేవిదంగా 7వార్డు సభ్యులు చాంద్ పాషా అనారోగ్యంతో ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకుని ఎమ్మెల్యే ఆయనను పరామర్శించా రు. ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా బిఆర్‌ఎస్‌కు మద్దతు పలకాలని, వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News