Friday, December 20, 2024

ఇద్దరు మావోయిస్టులు హతం..

- Advertisement -
- Advertisement -

మేదినీనగర్ (ఝార్ఖండ్ ): ఝార్ఖండ్ పాలము జిల్లాలో నిషేధిత ఝార్ఖండ్ జనముక్తి పరిషద్ కి చెందిన రెండు గ్రూపుల మధ్య తలెత్తిన అంతర్గత పోరులో కాల్పులకు ఇద్దరు హతమయ్యారని పోలీస్‌లు శనివారం వెల్లడించారు. లెస్లిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో హుతాయి గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. రెండు గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో చనిపోయిన ఇద్దరు సంతోష్ యాదవ్ , గణేష్ లోహ్రాగా గుర్తించినట్టు పాలము ఎస్‌పి రీష్మా రమేశన్ చెప్పారు. వీరిలో లోహ్రా జెజెఎంపి జోనల్ కమాండర్. ఇతని తలపై రూ. 5 లక్షల రివార్డు ప్రకటించి ఉంది. గ్రూపుల మధ్య పోరుకు కారణం ఇంకా తెలియరాలేదు. వీరి మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ కోసం మేదినిరాయి మెడికల్ కాలేజీ, ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News