Monday, December 23, 2024

అవినీతి మరకల మోడీ సర్కారు: మమత

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా : దేశంలో ఇప్పుడు సర్వత్రా బిజెపి భారత్ ఛోడో నినాదం మార్మోగుతోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమత బెనర్జీ చెప్పారు. మణిపూర్‌లో అత్యాచారాలకు పాల్పడ్డవారిని కేంద్రం కావాలనే ఉపేక్షిస్తోందని ఘాటుగా స్పందించారు. కేంద్రంలోని మోడీ సారధ్యపు ప్రభుత్వం అవినీతిపై మాట్లాడలేదని, ఎందుకంటే స్వయంగా ప్రధాని సారధ్యపు పిఎం కేర్ ఫండ్స్, రాఫెల్ డీల్, పెద్ద నోట్ల రద్దు వ్యవహారాలలో ఈ ప్రభుత్వంపై భారీ ముడుపుల ఆరోపణలు ఉన్నాయని మమత తెలిపారు. కోల్‌కతాలోనే ప్రధాని మోడీ జి 20 మంత్రుల సదస్సులో మాట్లాడుతూ తమ ప్రభుత్వం అవినీతిని పూర్తిగా అణచివేస్తుందని చెప్పిన నేపథ్యంలోనే మమత మోడీ సర్కారుపై అవినీతి అస్త్రాలు సంధించారు

. ఈ ప్రభుత్వానికి మణిపూర్‌పై మాట్లాడే ధైర్యం లేదు. అవినీతిపై ప్రస్తావిస్తే భయపడుతారని, పైగా చర్చల నుంచి విపక్షాలు వైదొలుగుతున్నాయని ఎదురుదాడికి దిగుతూ ఉంటారని మమత తెలిపారు. పలు విధాలుగా ప్రధాని ఈ జాతిని పక్కదోవపట్టిస్తున్నారని, దేశంలో పేదలెవ్వరూ బతికేందుకు వీల్లేకుండా చేయడమే బిజెపి ఆలోచనా విధానం అని చెప్పారు. మోడీ హయాంలో పలు స్థాయిలో అవినీతి జరిగిందని, డిఫెన్స్ పిఎస్‌యుల అమ్మకాలలో ముడుపులు చేతులు మారాయని, పైగా జాతీయ రక్షణకు భంగం వాటిల్లిందని మమత తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News